Home  »  TV News  »  Jayam serial :  అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిన వీరు-ఇషిక.. రుద్రను ఎదిరించిన సూర్య!

Updated : May 13, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -267 లో......గంగకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందంటే రుద్ర బయటకు తీసుకొని వెళ్తుంటాడు. ఇక వాళ్ళకి ఎదురుగా పెద్దసారు అటుఇటు తిరుగుతూ డల్ గా కనిపిస్తాడు. దాంతో పెద్దసారు దగ్గర రుద్ర, గంగ ఆగి మాట్లాడుతారు. అసలు సుధా ఆ ఇంటికి ఎలా, ఎందుకు దూరం అయిందో పెద్దసారు చెప్తాడు. సుధాకి మీ పెద్దమ్మ తమ్ముడిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకుంది.. కానీ సుధా, విశ్వని ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది.. శకుంతల వాళ్ళ తమ్ముడు బాధతో చనిపోయాడు. ఆ కోపం బాధ ఇప్పటికీ మీ పెద్దమ్మలో కన్పిస్తుందని పెద్దసారు గతం చెప్పగానే ఎందుకు పెద్దమ్మ ఇంత మొండిగా ఉందోనని అనుకున్నా కానీ దాని వెనకాల ఇంత బాధ ఉందా అని రుద్ర అంటాడు.

ఆ తర్వాత సూర్య వర్క్ చేసుకుంటుంటే ఇషిక, వీరు ఇద్దరు అతని దగ్గరికి వస్తారు. సూర్య చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు.. మెల్లిగా సక్సెస్ సాధిస్తున్నాడని ఇషిక అంటుంది. అయితే ఏం లాభం ఇషిక.. ఇప్పుడు క్రెడిట్ మొత్తం రుద్ర కొట్టేస్తున్నాడు కదా అని వీరు అంటాడు. మొన్న ప్రాజెక్ట్ గురించి తను ఒకే చేస్తేనే ఒకే అయింది.. అన్నీ తనే చూసుకుంటున్నాడని రంగా చెప్పాడు కదా.. అక్కడ రంగా చెప్పాల్సిన అవసరం ఏముంది.. రుద్ర చెప్పిస్తే మాత్రమే చెప్తాడు కదా.. ఇప్పుడు ఎవరైనా విజయేంద్ర ప్రతాప్ ఇల్లు ఎక్కడ అంటే చెప్తారు కానీ మీ మావయ్య రాఘవ ప్రతాప్ ఇల్లు అంటే చెప్తారా.. ఇక్కడ నీ భర్తకి, అక్కడ మీ మావయ్యకి గుర్తింపు లేదని వీరు అనగానే సూర్య కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు బాక్సింగ్ కి రెడీ అవ్వమని గంగకి రుద్ర చెప్తాడు. తర్వాత సూర్య దగ్గరికి రుద్ర వెళ్లి ఈ ఫైల్స్ ఏంటి ఇక్కడ వేసావని రుద్ర అడుగుతాడు. నాకు తెలుసు అన్నయ్య నువ్వు చెప్పాలా అని సూర్య సీరియస్ అవుతాడు. ప్రతీదానికి నువ్వు చెప్తే నేనేం చేసినట్టు.. నన్ను నా పని చేసుకోనివ్వు అని రుద్రతో సూర్య సీరియస్ గా మాట్లాడతాడు. అలా రుద్రపై సూర్య అరవడం చూసి ప్లాన్ సక్సెస్ అని వీరు, ఇషిక అనుకుంటారు. అదే సమయంలో స్నేహ చూస్తుంది. అదేంటి సూర్య అన్నయ్య  రుద్ర అన్నయ్యతో అలా కోపంగా మాట్లాడుతున్నాడని స్నేహ అనుకుంటుంది . ఆ తర్వాత బాక్సింగ్ ప్రాక్టీస్ కి గంగని తీసుకొని రుద్ర వెళ్తాడు. లోపలికి రండి అని గంగ అంటుంది. దాంతో రుద్ర చిరాకుపడతాడు. గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అలా కాదని విశ్వ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.